బహ్రెయిన్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
- February 05, 2022
బహ్రెయిన్: కోర్టు ఆదేశాల మేరకు గలాలీ ప్రాంతంలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేతను ముహరక్ మున్సిపాలిటీ ప్రారంభించింది. రెండు అంతస్తులు, కార్ పార్కింగ్ లు, అనుమతి లేని నిర్మాణాలు కూల్చివేసిన వాటిల్లో ఉన్నాయి. భవన నిర్మాణ చట్టాలను ఉల్లంఘించి ఓ వ్యక్తి అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ కట్టాడు. అందులో అనుమతి లేకుండానే ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేశాడు. ఇది గుర్తించిన మునిసిపాలిటీ పలు నోటీసులు జారీ చేసింది. BD1000 జరిమానా కూడా విధించింది. అయినా సదరు వ్యక్తి వాటిని ఖాతరు చేయకుండా అప్పీల్ కోర్టుకు వెళ్లగా.. విచారించిన కోర్టు అతని పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో మునిసిపాలిటీ సిబ్బంది ఆక్రమణలను కూల్చివేసింది. అంతకుముందు అందులో నివాసం ఉన్న అద్దెదారులందరికీ నోటీసులు అందించి ఖాళీ చేయించింది. 17984027 లేదా సోషల్ మీడియా ఖాతాల ద్వారా లేదా 80008001 తవాసుల్ ద్వారా ఉల్లంఘనలను తెలపాలని మున్సిపాలిటీ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







