మోడీ ను స్వాగతించేందుకు వెళ్లలేని కేసీఆర్
- February 05, 2022
హైదరాబాద్: నేడు ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్న విషయం తెలిసిందే. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రానికి వస్తున్న మోదీకి ఇవాళ మధ్యాహ్నం 02:10 గంటలకు సీఎం కేసీఆర్ స్వాగతం పలకడమే కాకుండా... శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉంటారని సీఎంవో వర్గాలు శుక్రవారం తెలిపాయి. ప్రస్తుతం కేసీఆర్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లడం లేదని తెలుస్తోంది. కాగా.. కేసీఆర్ స్వాగత కార్యక్రమం వరకే దూరంగా ఉంటారో... లేదంటే అన్ని కార్యక్రమాలకూ దూరంగా ఉంటారో తెలియాల్సి ఉంది. కాగా.. ముచ్చింతల్‌ల్లో జరిగే కార్యక్రమంలో మాత్రం కేసీఆర్ పాల్గొంటారని సమాచారం. మొత్తానికి ఆఖరి నిమిషంలో అంతా తారుమారై.. మోదీకి ఆహ్వానం పలికేందుకు కేసీఆర్ వెళ్లలేకపోతున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







