అఫ్ఘానిస్తాన్ లో భూకంపం..భారత్ లోనూ భూ ప్రకంపనలు
- February 05, 2022
ఈరోజు ఉదయం మూడు దేశాల్లో భూకంపాలు సంభవించాయి. అఫ్ఘానిస్తాన్ లో భూకంపం సంభవించగా..సరిహద్దు దేశమైన పాకిస్థాన్ లో కూడా భూ ప్రకంపంచనలు సంభవించాయి.
అలాగే భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. శనివారం (ఫిబ్రవరి 5,2022) సరిహద్దు దేశాల్లో సంభవించిన ఈ భూకంపం పాకిస్తాన్, అప్ఘానిస్థాన్ లలో 5.7 తీవ్రతగా నమోదు అయ్యింది. అలాగే ఉత్తర భారతంలోని ఢిల్లీ, జమ్ముకశ్మీర్,ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఉత్తరాఖండ్ లలో కూడా భూ ప్రకంపనలు జరిగాయి.
5.7 తీవ్రతతో అఫ్ఘానిస్తాన్-తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సుమారు 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లు కొందరు ట్వీట్ చేశారు. ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఆఫ్ఘన్-తజకిస్తాన్ బోర్డర్‌లో 9.45 నిమిషాలకు భూకంపం నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ తెలిపింది. 181 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు సెంటర్ పేర్కొన్నది.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







