లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కన్నుమూత
- February 06, 2022
ముంబై: ప్రముఖ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఇక లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న లతా మంగేష్కర్ కొద్ది క్షణాల క్రితం తుది శ్వాస విడిచారు.
పాటలతో, మంత్రముగ్దమైన, శ్రావ్యమైన కంఠంతో అందర్నీ అలరించిన ది గ్రేట్ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ తుది శ్వాస విడిచారు. కరోనా సోకడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కొద్దిరోజులుగా చికిత్స పొందుతున్న ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. అయితే ఆరోగ్యం క్రమంగా క్షీణించడంతో ఐసీయూలోనే ఉంచి వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గత రెండ్రోజుల్నించి ఆమె ఆరోగ్యం విషమిస్తుందనే వార్తలు కూడా వచ్చాయి. కొద్ది క్షణాల క్రితం ఆమె తుది శ్వాస విడిచారు. లతా మంగేష్కర్ కరోనా నుంచి కోలుకున్న తరువాత ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. వాస్తవానికి ఊపిరితిత్తుల సమస్య ఆమెకు చాలా కాలంగా ఉంది. నిన్నటి నుంచి పరిస్థితి ఒక్కసారిగా విషమిస్తూ వచ్చింది. ఇవాళ కొద్దిసేపటి క్రితం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు.జనవరి 8వ తేదీన ఆమెకు కరోనా సోకినట్టు నిర్ధారించారు.
దేశం గర్వించే సింగర్ లతా మంగేష్కర్. సంగీత సామ్రాజ్యంలో మకుటం లేని మహారాణిగా వెలిగిన లతా మంగేష్కర్‌కు భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవం లభించింది. నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశ స్వరకోకిలగా ఆమెను మాత్రమే పిలుస్తారంటే ఆమె ఖ్యాతి ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. దేశంలోని పలు భాషల్లో ఆమె పాటలు మంత్రముగ్దుల్ని చేస్తుంటాయి. 1929 సెప్టెంబర్ 28న ఇండోర్ లో జన్మించిన లతా మంగేష్కర్..13 ఏళ్ల ప్రాయంలోనే సింగర్ గా కెరీర్ ప్రారంభించారు. దేశంలోని పలు భాషల్లో ఇప్పటి వరకూ 25 వేలకు పైగా పాటలు పాడారు.కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే మూడు జాతీయ అవార్డులు దక్కించున్నారు లతా మంగేష్కర్. లతా మంగేష్కర్ సహా మొత్తం ఐదుగురు అక్కాచెల్లెళ్లు. ఆశా భోంస్లే, హృదయనాధ్ మంగేష్కర్, ఉషా మంగేష్కర్, మీనా మంగేష్కర్.
లతా పాడిన పాటల్లో దేశభక్తిని రగిలిస్తూ..కంటనీరు తెప్పించే పాట ఇప్పటికీ ఒక్కటే. అదే అయ్ మేరె వతన్ కే లోగో...ఎన్నిసార్లు విన్నా..కంటనీరు వచ్చి తీరుతుంది. పాటలో సాహిత్యానికి తోడు లతా ఆ పాటను పాడిన విధానం అటువంటిది. హృదయాల్ని హత్తుకుంటుంది. కంటనీరు తెప్పిస్తుంది. ఇక మరో పాట లగ్ జా గలే సే ఫిర్..ఎక్కడికో తీసుకెళ్లిపోతుంటుంది.చివరిగా ఆదివారం ఉదయం ఆమె కన్నుమూసినట్లుగా ప్రకటించారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







