కువైటీల సగటు జీతం నెలకు 1490 దినార్లు
- February 07, 2022
కువైట్: సెంట్రల్ స్టాటిస్టిక్స్ డిపార్ట్ మెంట్ లేబర్ మార్కెట్ గణాంకాలను విడుదల చేసింది. దాని ప్రకారం.. కువైట్లకు సగటు నెలవారీ జీతం నెలకు 1,490 దినార్లు కాగా, కువైటీయేతరులది 331 దినార్లుగా ఉంది. ప్రభుత్వ రంగంలో కువైటీల సగటు జీతం 1539 దినార్లు కాగా, ప్రభుత్వ రంగంలో కువైటీలు కాని వారి వేతనం 732 దీనార్లు అని గణాంకాలు చెబుతున్నాయి. ప్రైవేట్ రంగంలో కువైట్లకు సగటు నెలవారీ జీతం 1252 దినార్లు, కువైటీలు కానివారికి 311 దినార్లుగా ఉంది. కువైట్‌లోని స్త్రీ, పురుషుల మధ్య సగటు జీతాల్లో అంతరం ఉందని కూడా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కువైట్ పురుషుల సగటు జీతం 1801 దినార్లు, కువైట్ మహిళల సగటు జీతం 1,261 దినార్లుగా ఉన్నట్లు గణంకాల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!







