సింగిల్-డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్ వ్యాక్సిన్‌కు అనుమతి

- February 06, 2022 , by Maagulf
సింగిల్-డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్ వ్యాక్సిన్‌కు అనుమతి

న్యూఢిల్లీ: భారత్‌లో సింగిల్-డోస్ స్పుత్నిక్ లైట్ కోవిడ్-19 వ్యాక్సిన్‌కు DCGI అనుమతి లభించింది.రెండు డోసుల వ్యాక్సిన్ల త‌ర్వాత.. ఇప్పుడు బూస్ట‌ర్ డోసును కూడా ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే కాగా.. ఇప్పుడు.. సింగిల్ డోస్ వ్యాక్సిన్‌కు అనుమ‌తి ఇచ్చింది..ఈ సింగిల్ డోసు వ్యాక్సిన్‌ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అత్యవసర వినియోగ అనుమ‌తి ఇచ్చిన‌ట్టు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా. భార‌త్ విదేశీ వ్యాక్సిన్ల‌కు కూడా అనుమ‌తి ఇచ్చిన త‌ర్వాత రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ భారత్‌లో పంపిణీ చేస్తున్నారు.. 2021 జూన్ నుంచే స్పుత్నిక్ వి వ్యాక్సిన్‌ను పంపిణీ జ‌రుగుతోంది.. ఇప్పుడు స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సింగిల్ డోస్ కు అనుమ‌తి ల‌భించింది.. సింగిల్-డోస్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగ ఆమోదం వ‌చ్చింది.. కోవిడ్ -19కి వ్యతిరేకంగా భారతదేశం యొక్క పోరాటానికి ఇది మ‌రింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది.. ఇది దేశంలో 9వ కోవిడ్ వ్యాక్సిన్‌.. ఇది మహమ్మారిపై దేశం యొక్క సమిష్టి పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తుంది అంటూ ట్వీట్ చేశారు మన్సుఖ్ మాండవియా. కాగా, గత ఏడాది జూలై 1న, స్పుత్నిక్ లైట్‌కు అనుమ‌తి ఇవ్వ‌డానికి భారతదేశ ఔషధ నియంత్రణ సంస్థ నిరాకరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com