ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
- February 12, 2022
అమరావతి: ఏపీలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 896 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరో ఆరుగురు కోవిడ్ తో మరణించారు. అదే సమయంలో ఒక్కరోజులో 8వేల 849 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24వేల 454 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో 24గంటల వ్యవధిలో 24,066 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. శుక్రవారంతో (1,166) పోలిస్తే శనివారం కరోనా కేసుల సంఖ్య మరింత తగ్గింది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో అనంతపురం జిల్లాలో ఇద్దరు కోవిడ్ తో చనిపోయారు. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున కరోనాతో మరణించారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 14వేల 694కి పెరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,28,09,000 కరోనా టెస్టులు చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







