యూఏఈలో భిక్షాటన చేస్తే.. 3నెలల జైలు..
- February 13, 2022
యూఏఈ: యూఏఈలో భిక్షాటన చేసేవారి పై కఠిన చర్యలకు ఉపక్రమించింది.ఇక పై ఎవరైనా భిక్షాటన చేస్తూ కనిపిస్తే మూడు నెలల జైలుతో పాటు 5వేల దిర్హమ్స్ జరిమానా ఉంటుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది.ఈ మేరకు అధికారిక సోషల్ మీడియా ఛానెల్స్ ద్వారా కీలక ప్రకటన చేసింది.భిక్షాటనకు జరిమానా పై అవగాహన కల్పించడం కోసం ఫెడరల్ డిక్రీ-లా నం.31 ఆఫ్ 2021లోని ఆర్టికల్ 475లో నేరాలు, జరిమానాల చట్టానికి సంబంధించి పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఫిబ్రవరి 11న తన అధికారిక సోషల్ మీడియా ఛానెల్‌లలో వివరాలను పోస్ట్ చేసింది. “ఏదైనా రూపంలో లేదా పద్ధతిలో భౌతిక లేదా సాధకమైన ప్రయోజనాన్ని పొందేందుకు యాచిస్తూ పట్టుబడితే మూడు నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.5,000 దిర్హమ్స్‌కు తక్కువ కాకుండా జరిమానా విధించబడుతుంది.” అని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన పోస్టులో పేర్కొంది.
తాజా వార్తలు
- నాటో దేశాలకు ట్రంప్ షాక్
- ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు..!!
- ఎఫ్1 మళ్లీ బహ్రెయిన్‌కు? సమ్మర్ బ్రేక్‌కు ముందే క్లారిటీ..!!
- గంటకు 200 కి.మీ.కు పైగా వేగం.. ఇద్దరు డ్రైవర్లపై కేసులు..!!
- 19 కిలోలు బరువు తగ్గి Dh50,000 బహుమతి గెలిచిన యువకుడు..!!
- విదేశీ ప్రయాణం చేస్తున్నారా? దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు HMC కీలక సూచనలు..!!
- కువైట్‌లో రెండో విడత పరీక్షల షెడ్యూల్ విడుదల..!!
- సౌదీ అరేబియాలో మండిపోతున్న ఎండలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్







