ఎయిర్ ఇండియా ప్రయాణికులకు శుభవార్త
- February 13, 2022
ముంబై: టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టాటా సన్స్ గ్రూప్ ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఎషియా, విస్తారాలో మెజారిటీ వాటాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియాలో టాటా సంస్థకు చెందిన విమానయాన సంస్థలు కావడంతో టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకున్నది.ఇక పై ఎయిర్ ఇండియా విమానాల్లో టికెట్ బుక్ చేసుకొని అనుకోని విధంగా ఫ్లైట్ క్యాన్సిల్ అయితే, అదే సమయంలో ఎయిర్ ఏషియా విమానం అందుబాటులో ఉంటే అందులో ప్రయాణం చేసేందుకు ఒప్పందం కుదరిందని టాటా కంపెనీ పేర్కొన్నది.ఎయిర్ ఇండియా,ఎయిర్ ఏషియా రెండు విమానాల్లో ఏ విమానం రద్దయినా ప్రయాణికుడికి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాటా గ్రూప్ ప్రకటించింది.ఈ ఒప్పందం రెండేళ్లపాటు అంటే ఫిబ్రవరి 9,2024 వరకు వర్తిస్తుందని పేర్కొన్నది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







