మొబైల్ బస్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రారంభం
- February 14, 2022
ఒమన్: రెండువారాలపాటు కొనసాగనున్న మొబైల్ బస్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ప్రారంభమైంది. డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, ఆస్టర్ అల్ రఫా హాస్పిటల్ సహకారంతో మస్కట్ గవర్నరేట్‌లో ఈ సర్వీసును ప్రారంభించారు. ఈ బస్సు పలు ప్రాంతాల్లో పర్యటించి సిటిజన్స్/రెసిడెంట్స్ లకు కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను అందజేస్తుందని మస్కట్ గవర్నరేట్‌లోని డైరెక్టరేట్-జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌లోని డిసీజ్ కంట్రోల్ డైరెక్టర్ డాక్టర్ లామియా బింట్ హుస్సేన్ అల్ బలూషియా చెప్పారు. అల్ మబెల్లా సౌత్‌లోని మస్కట్ మాల్ లో రెండు రోజుల పాటు సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఫిబ్రవరి 24 వరకు బుషర్, ముత్రా, మస్కట్, అల్ అమెరత్‌లోని విలాయత్‌లలో కూడా ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుందని అల్ బలూషియా తెలిపారు. మొబైల్ బస్ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్ ముఖ్యంగా బూస్టర్ డోస్‌ను(మూడో డోస్) పెంచడం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







