మనీలాండరింగ్ కు పాల్పడ్డ 11మందికి 52 ఏళ్ల జైలు శిక్ష
- February 14, 2022
సౌదీ: మనీలాండరింగ్‌లో పాల్గొన్న గ్రూప్‌కు 52 సంవత్సరాల జైలు శిక్ష, SR62.5 మిలియన్ జరిమానాలను ప్రత్యేక న్యాయస్థానం విధించింది. మనీలాండరింగ్ నేరాలకు పాల్పడ్డ వారిలో 11 మంది సభ్యుల (ఇద్దరు సిటిజన్స్, తొమ్మిది మంది రెసిడెంట్స్) ముఠా సభ్యులు ఉన్నారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది. వీరు అనేక వాణిజ్య సంస్థలు, బ్యాంక్ ఖాతాల నుండి మొత్తం SR10 బిలియన్ల కంటే ఎక్కువ మొత్తంలో డబ్బును స్వీకరించడం లేదా బదిలీ చేయడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ నేరస్థులకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు సమర్పించడంతో వారికి మొత్తం 52 సంవత్సరాల జైలు శిక్ష, SR62.5 మిలియన్ల జరిమానాతో ప్రత్యేక న్యాయస్థానం ప్రాథమిక తీర్పును వెల్లడించింది. అలాగే SR1,672,862 విలువైన ఆస్తులను జప్తు చేసింది. జైలు శిక్షలు అనుభవించిన తర్వాత సౌదీ అరేబియా నుండి రెసిడెంట్స్ ను బహిష్కరించనున్నారు. సిటిజన్స్ ను వారి శిక్షా కాలంలో ప్రయాణించకుండా నిషేధించింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







