హెల్త్ రెగ్యులేషన్స్ పాటించని 70% దుకాణాలు
- February 14, 2022
కువైట్: 70 శాతం టెక్స్ టైల్ మార్కెట్లు, షాపులు ఆరోగ్య నియంత్రణ చర్యలు పాటించడం లేదని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని హెల్త్ రెగ్యులేషన్స్ టీమ్ పేర్కొంది. 70 శాతం దుకాణాలు నిబంధనలకు లోబడి లేవని జ్యుడీషియల్ పోలీస్ ఇన్స్పెక్టర్లు తమ తనిఖీల్లో గుర్తించారని కమోడిటీస్ పర్యవేక్షణ టీమ్ లీడర్, టెక్నికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఫైసల్ అల్-అన్సారీ తెలిపారు. సంబంధిత మార్కెట్లు క్యాబినెట్ ఆదేశాలను కచ్చితంగా పాటించేలా చూసేందుకు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని హెల్త్ రెగ్యులేషన్స్ టీమ్ టెక్స్ టైల్ మార్కెట్, టైలరింగ్ షాపులలో ఇంటెన్సివ్ తనిఖీ క్యాంపెయిన్ ను ప్రారంభించిందన్నారు. తనిఖీల్లో భాగంగా నిబంధనలు పాటించని దుకాణాల యజమానులకు ఇన్స్పెక్టర్లు హెచ్చరికలు జారీ చేశారన్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం వంటి ఆరోగ్య నిబంధనలను అందరూ కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







