పిల్లల కోసం అందుబాటులోకి రానున్న మరో కరోనా వ్యాక్సిన్!
- February 14, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనాకు వ్యతిరేకంగా మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నది. 12-18 సంవత్సరాల్లోపు పిల్లల కోసం బయోలాజికల్ ఈ కంపెనీ కార్బెవాక్స్ పేరుతో వ్యాక్సిన్‌ను రూపొందించగా.. అత్యవసర వినియోగం కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసింది.దరఖాస్తుపై ఇవాళ నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వచ్చే ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పిల్లలకు కొవిడ్ ఇమ్యునైజేషన్ డ్రైవ్ వేగవంతం చేయడంలో సహాయపడనున్నది.
హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఈ కంపెనీ సమర్పించిన కార్బెవాక్స్ వ్యాక్సిన్‌కు సంబంధించిన డేటాను నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని, సంతృప్తి చెందితే అత్యవసర వినియోగానికి సిఫారసు చేస్తుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇప్పటికే కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ 18 సంవత్సరాలుపైబడిన వ్యక్తులకు వేసేందుకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చింది. కేంద్రం కార్బోవాక్స్ టీకాలకు బయోలాజికల్ ఈ కంపెనీ గత ఏడాది ఆర్డర్ ఇచ్చిన విషయం విధితమే. అయితే, ప్రస్తుతం దేశంలో 97శాతం మంది వయోజన జనాభాకు ఒక్క డోసు వ్యాక్సిన్ ఇవ్వగా.. 77శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ అందింది. ఈ క్రమంలో కార్బెవాక్స్ వ్యాక్సిన్‌ను బూస్టర్ డోస్‌గా లేదంటే.. పిల్లలకు వేయనున్నట్లుగా తెలుస్తున్నది.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







