‘బహ్రెయిన్ 2023 స్కాలర్షిప్’ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం
- February 15, 2022
బహ్రెయిన్: క్రౌన్ ప్రిన్స్ ఇంటర్నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ (CPISP) 2023 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆన్ లైన్ లో క్యాంపెయిన్ ప్రారంభించింది. కింగ్ డమ్ లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ కు అప్లై చేసుకోవచ్చు. CPISP 2023 స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కోసం మార్చి 1 - 17 మధ్యలో వెబ్ సైట్ లో దరఖాస్తులను సమర్పించాలి. స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న దరఖాస్తుదారుల ఇంగ్లిష్ స్కిల్స్, రీజనింగ్ ఎబిలిటీస్ ను పరీక్షించనున్నారు. ఇందు కోసం అర్హత గల విద్యార్థులకు ఇమెయిల్ ద్వారా ఆహ్వానాన్ని పంపుతారు. బహ్రెయిన్ పౌరసత్వం కలిగి విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకునేందుకు అర్హులు. 11వ తరగతి (లేదా తత్సమానం)లో చేరి, 2023లో సెకండరీ స్కూల్ నుండి గ్రాడ్యుయేట్ పూర్తి చేయాలి. అలాగే 97% గ్రేడ్ పాయింట్ యావరేజ్ (GPA)ని కలిగి ఉండాలి.
తాజా వార్తలు
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం







