షార్జా సఫారీ రేపే ప్రారంభం: టిక్కెట్ల ధరలు, సమయాల ప్రకటన
- February 16, 2022
యూఏఈ: షార్జా సఫారీ ఫిబ్రవరి 17 నుంచి సందర్శకులకు అందుబాటులోకి రానుంది.ఆఫ్రికా వెలుపల ఇదే అతి పెద్ద పార్కుగా చెప్పబడుతోంది.అల్ దయిద్‌లో దీన్ని ఏర్పాటు చేశారు. 8 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో 120 జంతువులు అలాగే 100,000కి పైగా ఆఫ్రికన్ చెట్లతో దీన్ని తీర్చిదిద్దారు.టిక్కెట్ల ధరల విషయానికొస్తే, బ్రాంజ్ టిక్కెట్లు (వాకింగ్ టూర్) 12 ఏళ్ళు పైబడినవారికి 40 దిర్హాములతోనూ, 3 నుంచి 12 ఏళ్ళ వయసు చిన్నారులకు 15 దిర్హాములతోనూ పార్కులోకి ప్రవేశం కల్పిస్తారు.రెండు నుంచి మూడు గంటల సమయం అనుమతిస్తారు. సిల్వర్ టిక్కెట్ల ధర 12 ఏళ్ళ పైబడిన వారికి 120 దిర్హాములు కాగా, చిన్నారులకు 50 దిర్హాములు. సాధారణ బస్సులో సీటు రిజర్వ్ చేయబడుతుంది.ఐదు నుంచి ఆరు గంటల సమయం వుంటుంది.గోల్డ్ టిక్కెట్ల ధర 275 దిర్హాములుగా వుంది పెద్దలకి.అదే పిల్లలకైతే 120 దిర్హాములు.లగ్జరీ వాహనంలో సీట్ రిజర్వ్ చేయబడుతుంది.ప్రివిలేజ్ గైడ్ ద్వారా సఫారీలోని అన్ని ప్రాంతాలూ చూపిస్తారు.ఐదు నుంచి ఆరు గంటల సమయం వుంటుంది.ఆరుగురు వ్యక్తులకు లగ్జరీ వెహికిల్ ధర 500 దిర్హాములు.తొమ్మిది మందికి 2,250 దిర్హాములు. 15 మందికి 3,500 దిర్హాములు. ఉదయం 8.30 నిమిషాల నుంచి సాయంత్రం 6.30 నిమిషాల వరకు సందర్శన సమయం.మధ్యాహ్నం 2 గంటల వరకు గోల్డ్ మరియు సిల్వర్ టిక్కెట్లు కలిగినవారికి అనుమతిస్తారు.బ్రాంజ్ టిక్కెట్లున్నవారికి సాయంత్రం 4 గంటల వరకు అనుమతిస్తారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష