ఫీమేల్ ట్రావెలర్స్ కు సేఫేస్ట్ సిటీస్ గా మదీనా, దుబాయ్

- February 17, 2022 , by Maagulf
ఫీమేల్ ట్రావెలర్స్ కు సేఫేస్ట్ సిటీస్ గా మదీనా, దుబాయ్

ప్రపంచ వ్యాప్తంగా టాప్ 5 సురక్షిత నగరాల జాబితాలో మదీనా, దుబాయ్ సిటీస్ నిలిచాయి. ఈ నగరాలు ఫీమేల్ ట్రావెలర్స్ కోసం అత్యంత సురక్షిత నగరాలుగా మన్ననలు పొందాయి. ఈ మేరకు InsureMyTrip  నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం.. సౌదీ నగరం మదీనా మొత్తం 10/10 స్కోర్‌తో ఒంటరి ఫీమేల్ ట్రావెలర్స్ కు అత్యంత సురక్షితమైన నగరంగా పేర్కొంది. దుబాయ్ నగరంలో క్రైమ్ రేట్ చాలా తక్కువని, సింగిల్ ఫీమేల్ ట్రావెలర్స్ కు మూడవ అత్యంత సురక్షితమైన నగరంగా నిర్ణయించింది. మహిళల ప్రయాణం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన దుబాయ్‌లోని పబ్లిక్ ట్రాన్స్ పోర్టును ఈ అధ్యయనం అభినందించింది. చియాంగ్ మాయి, క్యోటో అండ్ మకావో వరల్డ్ టాప్ అయిదు సురక్షితమైన నగరాల జాబితాలో చోటు సంపాదించాయి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com