ఏపీ కరోనా అప్డేట్

- February 17, 2022 , by Maagulf
ఏపీ కరోనా అప్డేట్

అమరావతి: ఏపీలో కరోనా వైరస్ తోకముడుస్తోంది.క్రమక్రమంగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. భారతదేశ వ్యాప్తంగా కూడా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతుండడంతో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకొంటోంది.కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పరిస్థితులపై ప్రాంతీయ అధికారులు సమీక్షలు చేపట్టాలని జాతీయ ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సూచించారు. ఇక ఏపీ విషయానికి వస్తే..వేల సంఖ్యలో నమోదైన కేసులు..ప్రస్తుతం వందల సంఖ్యలో రికార్డవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం పలు నిబంధనలు, ఆంక్షలను సడలిస్తోంది.24 గంటల వ్యవధిలో 528 మందికి కరోనా సోకింది. కరోనాతో చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మరణించారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లాలో 101, పశ్చిమ గోదావరి జిల్లాలో 92 కోవిడ్ కొత్త కేసులు వెలుగు చూశాయి. 22 వేల 339 శాంపిల్స్ పరీక్షంచగా 528 మందికి కోవిడ్ సోకిందని తేలిందని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 1864 మంది ఆరోగ్యవంతులుగా కోలుకున్నారని, నేటి వరకు రాష్ట్రంలో 3,29,16,247 శాంపిల్స్ పరీక్షించినట్లు తెలిపింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com