'వ్యాక్సినేషన్ లేని' ఎంట్రీ కువైటీలకే పరిమితం: DGCA సర్క్యులర్
- February 18, 2022
కువైట్: 'వ్యాక్సినేషన్ లేని' ఎంట్రీని కువైట్ పౌరులకు మాత్రమే పరిమితం చేస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) సర్క్యులర్ జారీ చేసింది. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్న అన్ని విమానయాన సంస్థలకు ఈ సర్క్యులర్ ను పంపారు. ఫిబ్రవరి 20 వరకు ప్రయాణికులందరూ స్వేచ్ఛగా కువైట్ వదిలి వెళ్ళడానికి అనుమతించారు. అయితే దేశంలోకి వచ్చేందుకు మాత్రం కరోనా నియంత్రణ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోని ప్రయాణీకులు, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేకుండా దేశంలోకి ప్రవేశించే "కువైటీలు" ప్రయాణానికి ముందు 72 గంటల ముందు చేసుకున్న పీసీఆర్ నెగటివ్ సర్టిఫికేట్ సమర్పించాలని సర్క్యులర్ పేర్కొంది. 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను ఈ ప్రక్రియ నుండి మినహాయింపునిచ్చారు. కాగా ఈ సర్క్యులర్‌లో నాన్ కువైట్ల గురించి ప్రస్తావించలేదు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్‌లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్‌లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్‌పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్‌లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్‌గ్రేడ్‌లో 72% పనులు పూర్తి..







