21 ఏళ్ల తర్వాత..భూమిక చావ్లా మరోసారి అలా..
- February 18, 2022
భూమిక.. పదేళ్ల క్రితం ఈ హీరోయిన్ అంటే చాలామందికి క్రష్. దాదాపు టాలీవుడ్‌లోని అప్పటి స్టార్ హీరోలు అందరితో జతకట్టింది భూమిక. అంతే కాదు.. అందులో చాలావరకు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి కూడా. పవన్ కళ్యాణ్‌తో చేసిన 'ఖుషి' సినిమా అయితే అప్పట్లో ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. అందులో భూమిక చేసిన మధు పాత్ర ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటుంది. అయితే ఖుషి వచ్చిన 21 ఏళ్ల తర్వాత మరోసారి ఆ మ్యాజిక్‌ను రీక్రియేట్ చేసింది భూమిక.
దాదాపు నాలుగేళ్ల వరకు టాలీవుడ్‌లోని స్టార్ హీరోయిన్లతో పోటీపడి మరీ సినిమా అవకాశాలు దక్కించుకుంది భూమిక. కానీ కొంతకాలం తర్వాత తాను నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడంతో తనకు అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఇక కొంతకాలానికి అక్క పాత్రలతో టాలీవుడ్లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది భూమిక. తాను హీరోయిన్గా ఫేడవుట్ అయిపోయి ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ భూమిక గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు. అందుకే తన ఫ్యాన్స్ కోసం, ఖుషి సినిమా ఫ్యాన్స్ కోసం అందులోని 'అమ్మాయే సన్నగా' పాటకు స్టెప్పులేసింది భూమిక. తన డబ్బింగ్ ఆర్టిస్ట్ సవితా రాధాకృష్ణన్‌తో కలిసి భూమిక వేసిన స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన డ్యాన్స్‌ను చూసి ప్రేక్షకులందరూ మరోసారి ఖుషి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్‌లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్‌లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్‌పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్‌లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్‌గ్రేడ్‌లో 72% పనులు పూర్తి..







