ఉస్మానియా యూనివర్సిటీ లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం..
- February 18, 2022
హైదరాబాద్: తెలంగాణలోని ప్రతిష్టాత్మక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం సృష్టిస్తోంది.ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు ఓయూ విద్యార్థి నాయకులు.. ఉస్మానియా యూనివర్సిటీ నకిలీ సర్టిఫికెట్లతో అమెరికాలో చదువుతున్న ముద్దం స్వామిపై సీపీకు ఫిర్యాదు చేశారు.ఇక, నకిలీ సర్టిఫికెట్ వ్యవహారాన్ని ఉస్మానియా అధికారులు కూడా ధృవీకరించారు..నకిలీ సర్టిఫికెట్ విషయాన్ని సీపీకి వివరించారు విద్యార్థి నేతలు… కన్సల్టేషన్, ఎడ్యుకేషన్, ఇనిస్టిట్యూట్స్ అడ్డగా ఈ దందా సాగుతుందని సీపీ దృష్టికి తీసుకెళ్లారు.ఫిర్యాదుతో సహా తగిన ఆధారులను సీపీకి అందజేశారు.ఇలా ఎంతో మంది నకిలీ సర్టిఫికెట్లు పొందారో సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.. పలువురు ఫేక్ సర్టిఫికెట్లతో విదేశాలకు వెళ్లారు అని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.ఈ వ్యవహారం వెనుక అధికారుల పాత్రపై విచారణ చేయాలని కోరారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని, ముద్దం స్వామిని 10 రోజులలో అదుపులోకి తీసుకుంటామని సీపీ హామీ ఇచ్చినట్టు విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







