తెలంగాణ కరోనా అప్డేట్
- February 18, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది.కోవిడ్ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 425 కరోనా కేసులు నమోదయ్యాయి.అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 130 కొత్త కేసులు వెల్లడయ్యాయి.రంగారెడ్డి జిల్లాలో 29, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 28, నల్గొండ జిల్లాలో 23, ఖమ్మం జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.
అదే సమయంలో 1,060 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించ లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,86,021 మంది కరోనా బారినపడగా వారిలో 7,75,802 మంది కోలుకున్నారు.రాష్ట్రంలో ప్రస్తుతం 6వేల 111 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4,108. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 41,042 కరోనా పరీక్షలు చేశారు. క్రితం రోజుతో(453 కేసులు) ఇవాళ కరోనా కేసులు తగ్గాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







