తక్కువ ధరకే ఖరీదైన మెడిసిన్: యూఏఈ హెల్త్ మినిస్ట్రీ

- February 21, 2022 , by Maagulf
తక్కువ ధరకే ఖరీదైన మెడిసిన్: యూఏఈ హెల్త్ మినిస్ట్రీ

యూఏఈ: పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్, మల్టిపుల్ మైలోమా, యాక్టివ్ అల్సరేటివ్ కొలిటిస్ అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు సంబంధించిన మెడిసిన్ ఇకపై తక్కువ ధరకే లభించనుంది. ఈ మేరకు ఆరోగ్యం, నివారణ మంత్రిత్వ శాఖ (MoHAP), జాన్సన్ & జాన్సన్ వారి జాన్సెన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ, గ్లోబల్ హెల్త్‌కేర్ కన్సల్టింగ్ సంస్థ అయిన ఆక్సియోస్ ల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంతో బీమా లేని, తక్కువ-ఆదాయ ప్రవాస రోగులకు ఆయా వ్యాధుల చికిత్సకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. ఈ ఒప్పందంతో ఖరీదైన మెడిసిన్ తక్కవ ధరకే అందుబాటులోకి రానుందని MoHAP వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com