డ్రోన్ల ఫ్లయింగ్ పై నిషేధాన్ని పొడిగించిన యూఏఈ
- February 22, 2022
యూఏఈ: డ్రోన్ల ప్లయింగ్ తోపాటు తేలికపాటి స్పోర్ట్స్ ఎయిర్‌క్రాఫ్ట్ ల కార్యకలాపాలను నిలిపివేయాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి నోటీస్ ఇచ్చే వరకు వీటిపై నిషేధం కొనసాగుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. డ్రోన్ల వినియోగాన్ని కొందరు దుర్వినియోగం చేయండం, అనుమతులు లేని ప్రాంతాలలో ఎగురవేయడాన్ని గుర్తించిన తర్వాతే గత నెలలో తీసుకున్న నిషేధ ఉత్తర్వులను తాజాగా మరోసారి పొడిగించినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి Dh100,000 జరిమానా, జైలు శిక్ష కూడా విధించబడుతుందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







