850 మిలియన్ దిర్హామ్‌లతో టూరిస్ట్, ఎంటర్‌టైన్‌మెంట్ డెస్టినేషన్
- March 31, 2016
అబుదాబీలో కొత్త టూరిస్ట్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ డెస్టినేషన్‌ని 850 మిలియన్ దిర్హామ్‌లతో నిర్మించనున్నారు. ఇందులో రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్స్, రిటైల్ ఔట్‌లెట్స్, సినిమా హాల్, మెరినీ క్లబ్, కమ్యూనిటీ సెంటర్ వంటివి ఏర్పాటు కానున్నాయి. అల్ బరాఖా ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. బుధవారం గ్రౌండ్ బ్రేకింగ్ సెర్మానీ షేక్ జాయెద్ గ్రాండ్ మాస్క్ సమీపంలో జరిగింది. అబుదాబీ మునిసిపాలిటీ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 150,000 చదరపు మీటర్ల వైశాల్యంలో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ 2018 నాటికి పూర్తి కానుంది. 2.5 కిలోమీటర్ల బూమిని అబుదాబీ మునిసిపాలిటీ నుంచి లీజుకు తీసుకున్నట్లు డెవలపర్స్ వెల్లడించారు. అల్ ఖానా పేరుతో ఈ ప్రాజెక్ట్‌ని రూపొందిస్తున్నారు. అల్ ఖానాలో 5000 మీటర్ల ఎత్తుగల అతి పెద్ద అక్వేరియంను ఏర్పాటు చేస్తారు. 98 మినీ యాచ్ట్స్‌తో మెరీనా క్లబ్‌ని ప్లాన్ చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







