దుబాయ్‌లో ఇద్దరు ఆఫ్రికన్లకు 3 ఏళ్ళ జైలు శిక్ష

- March 02, 2022 , by Maagulf
దుబాయ్‌లో ఇద్దరు ఆఫ్రికన్లకు 3 ఏళ్ళ జైలు శిక్ష

దుబాయ్: హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలపై దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఇద్దరు ఆఫ్రికన్లకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. UAE కుటుంబానికి పనిమనిషిగా ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి దుబాయ్ కి తీసుకొచ్చి అనైతిక కార్యకలాపాలకు పాల్పడేందుకు వీలుగా తనను బంధించారని గత జూన్‌లో ఒక ఆఫ్రికన్ అమ్మాయి పెట్రోలింగ్‌ సిబ్బందికి ఫిర్యాదు చేసింది. తనను ఆఫ్రికన్ వ్యక్తులు నిర్బంధించడమే కాకుండా.. తనపై అత్యాచారం చేసి, అసభ్యకరమైన కార్యకలాపాలు చేసేందుకు బలవంతం చేశారని ఫిర్యాదులో చెప్పింది. Dhs 20,000 చెల్లించే వరకు తాము చెప్పిన పని చేయాలంటూ బలవంతం చేశారని పోలీసుల ఎదుట బాధితురాలు వాపోయింది. ఈ క్రమంలో అనారోగ్యం పేరిట తప్పించుకొని తనకు తెలిసిన ఓ వ్యక్తి దగ్గర ఆశ్రయం పొందింది. అతడు ఆమె పాస్ పోర్ట్ కోసం ముఠా సభ్యులను ప్రశ్నించగా.. సదరు వ్యక్తిని బంధించి చిత్రహింసలు పెట్టి బాధితురాలు ఉన్న అడ్రస్ ని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో బాధితురాలిని ముఠా సభ్యులు తరలించే క్రమంలో పెట్రోలింగ్‌ సిబ్బందిని చూసి చూసి సహాయం కోసం అరవడంతో భయంతో ముఠా సభ్యులు అక్కడి నుంచి పారిపోతుండగా.. పోలీసులు పట్టుకొని విచారించడంతో జరిగిన ఘోరం బయటకు వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com