ఒమన్ లో ఊబర్ టాక్సీ సర్వీసులు

- March 02, 2022 , by Maagulf
ఒమన్ లో ఊబర్ టాక్సీ సర్వీసులు

మస్కట్:  యాప్ ఆధారిత టాక్సీ సర్వీస్ – ఊబర్ ఒమన్ సుల్తానేట్ లో అందుబాటులోకి వచ్చింది. ఈమేరకు ఊబర్ స్మార్ట్ టాక్సీ సర్వీసులకు లైసెన్స్ మంజూరు చేసినట్లు రవాణా, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 900 నగరాల్లో ఉన్న ఊబర్ సర్వీసును ఒమన్‌లో నడిపేందుకు అనుమతిచ్చామని, దీంతో ప్రయాణికులందరికీ ఆన్-డిమాండ్ టాక్సీ సేవలు అందుబాటులో ఉంటాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈసందర్భంగా ఊబర్ స్మార్ట్ సిటీస్ CEO అహ్మద్ సలీమ్ అల్ సియాబీ మాట్లాడుతూ.. జనవరిలో మస్కట్ గవర్నరేట్‌లో ప్రయోగాత్మకంగా ప్రారంభామని, అది విజయవంతం అవ్వడంతో ఒమన్‌లోని అన్ని గవర్నరేట్‌లలో టాక్సీ సేవలను అందించడానికి తమకు  లైసెన్స్ మంజూరు అయిందన్నారు. మహిళా డ్రైవర్ల ద్వారా మాత్రమే నిర్వహించబడే మహిళా టాక్సీ సర్వీస్ కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. RO10 నుండి గంటవారీ ప్యాకేజీలు ప్రారంభమవుతాయని, చెల్లింపులు నగదు, కార్డ్ లేదా యాప్‌లోని వాలెట్‌ ద్వారా చెల్లింపులు చేయొచ్చన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com