సౌదీలో తొలిసారిగా పోర్న్ అడిక్షన్ ప్రోగ్రామ్ లాంచ్
- March 02, 2022సౌదీ: GCC లోనే మొట్టమొదటి పోర్న్ అడిక్షన్ ట్రీట్‌మెంట్ ప్రోగ్రామ్‌ను సౌదీ అరేబియా ప్రారంభించింది. 100 రోజుల్లో బాధితులకు చికిత్స అందించడం దీని లక్ష్యంగా నిర్దేశించారు. కొత్త ప్రోగ్రామ్ లో భాగంగా కౌన్సెలింగ్, టెన్ స్టెప్స్ రికవరీ సిస్టమ్ ను అమలు చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేల్ అండ్ ఫీమేల్స్ కు అందుబాటులో ఉంటుంది. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఆధ్యాత్మిక చికిత్స, సురక్షితమైన సహాయక వాతావరణం ఏర్పాటుతో చికిత్స అందిస్తారు. పోర్న్ ప్రోగ్రామ్ అశ్లీలత హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుంది. రికవరీ ప్రక్రియలో ఇస్లామిక్ బోధనలను కూడా భాగం చేశారు. పోర్న్ ప్రోగ్రామ్ ను విజయవంతంగా ముగించినవారికి ప్రోత్సాహకాలుగా బహుమతులను కూడా అందించనున్నారు. ప్రోగ్రాం డైరెక్టర్ సౌద్ అల్-హస్సానీ మాట్లాడుతూ.. అశ్లీలత అనేది మానవ విలువలు, మానసిక ఆరోగ్యం, ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందన్నారు. దానికి బానిసైన వారు వేధింపులు, హింస వంటి వాటికి పాల్పడే అవకాశం ఉంటుందని, ఈ సమస్యతో సామాజిక, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతను దూరం చేస్తుందన్నారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







