పూర్తయిన అబుదాబి-దుబాయ్ రైలు మార్గం

- March 02, 2022 , by Maagulf
పూర్తయిన అబుదాబి-దుబాయ్ రైలు మార్గం

అబుదాబి: అబుదాబి- దుబాయ్ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. ఇది పూర్తిగా అందుబాటులోకి వస్తే రెండు ఎమిరేట్స్ మధ్య 50 నిమిషాలలోపు ప్రయాణించవచ్చు. నేషనల్ రైల్ నెట్‌వర్క్ లో భాగంగా UAE రాజధాని, దుబాయ్ మధ్య లైన్ నిర్మించడానికి 47 మిలియన్ పని గంటలు(27 నెలలు) పట్టింది. 256కిమీ పొడవున్న ఈ ట్రాక్‌లో 29 వంతెనలు, 60 క్రాసింగ్‌లు, 137 డ్రైనేజీ ఛానళ్లు ఉన్నాయి. మొత్తం 46 మిలియన్ క్యూబిక్ మీటర్ల తవ్వకం, బ్యాక్‌ఫిల్ పని జరిగింది. 13,300 మంది కార్మికులు రైల్వే లైన్ ప్రక్రియలో పాల్గొన్నారు. UAE రైల్వే ప్రోగ్రామ్ 50 బిలియన్ల పెట్టుబడితో 50 ప్రాజెక్ట్ లలో భాగంగా ప్రారంభించబడింది. ఇది ఏడు ఎమిరేట్స్ ను అనుసంధానించే రైల్వే ప్రాజెక్టుల జాతీయ నెట్‌వర్క్ ను కలిగి ఉంది. ఈ చారిత్రాత్మక క్షణానికి సంబంధించిన వీడియో, ఫోటోలను దుబాయ్ రూలర్, ఉప ప్రధాన మంత్రి, ఆర్థిక మంత్రి షేక్ మక్తూమ్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పోస్ట్ చేశారు. ఆయనతోపాటు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ కోర్ట్ అండ్ ఎతిహాద్ రైల్ ఛైర్మన్ షేక్ దియాబ్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఉన్నారు. ప్యాసింజర్ రైళ్లు అల్ సిలా నుండి ఫుజైరా వరకు 11 నగరాలను కలుపుతూ UAE మధ్య కనెక్టివిటీని బలోపేతం చేస్తుందని షేక్ మక్తూమ్ బిన్ మొహమ్మద్ తన ట్వీట్ లో రాసుకొచ్చారు. ఒక్కో రైలుకు 400 మంది ప్రయాణీకుల సామర్థ్యంతో 200kmph వేగంతో ప్రయాణిస్తుంది. 2030 నాటికి వినియోగదారుల సంఖ్య ఏటా 36.5 మిలియన్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com