చెత్త తరలించటానికి అత్యాధునిక వాహనాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- March 02, 2022
నగరంలోని పీపుల్స్ ప్లాజా వద్ద చెత్త తరలించే 40 అత్యాధునిక వాహనాలను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలను కాంకీ సంస్థ ఏర్పాటు చేసింది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు తరలిస్తాయి ఈ వాహనాలు. చెత్త తరలించే అత్యాధునిక వాహనాలకు ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఏ నగరంలో అయినా రెండు ముఖ్యమైన వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ ఉంటాయి. స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు పరిష్కారాలు వెతుకుతున్నామని తెలిపారు. 2014లో 2500 మెట్రిక్ టన్నుల చెత్త సేకరిస్తే.. ప్రస్తుతం 6 వేల మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నాం. 4500 స్వచ్ఛ ఆటో టిప్పర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆటోలను చెత్త సేకరణకు ఉపయోగిస్తున్నాం. త్వరలోనే మరో 400 ఆటోలు నెల రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. 150 డివిజన్లలో డోర్ టు డోర్ కలెక్షన్‌కు వినియోగిస్తామని అన్నారు.
విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలంటే ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనీ..హైదరాబాద్ నగర ప్రజలకు ఎటువంటి దుర్గంధం వెదజల్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. 95 సెకండరీ కలెక్షన్ ట్రాన్స్‌ఫర్ పాయింట్లు ఏర్పాటు చేసుకున్నామని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు.
మొబైల్ కలెక్షన్ ట్రాన్స్‌ఫర్ పాయింట్లు కూడా ఏర్పాటు చేసుకున్నామని..నగరాన్ని పరిశుభ్రంగా ఉంచటానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అత్యాధునికమైన సాలిడ్ వేస్ట్ ట్రీట్‌మెంట్ ఉండాలన్న ఉద్దేశంతో అత్యాధునిక పద్ధతులను అవలంభిస్తున్నామని తెలిపిన మంత్రి.. లిక్విడ్ వేస్ట్ ట్రీట్‌మెంట్ కోసం సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చెరువుల్లో చెత్త, గుర్రపు డెక్కను తరలించేందుకు వాహనాలను వినియోగిస్తున్నామని..హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న మన సీఎం కేసీఆర్ ఆశయానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా మెలగాలని కేటీఆర్ సూచించారు.
తాజా వార్తలు
- కొత్త క్యాంపస్ ఏపీలో...12,000 కొత్త ఉద్యోగాల అవకాశాలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్‌లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్‌గ్రౌండ్‌లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం