స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో జాబ్స్..
- March 02, 2022
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, విజయవాడ, నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను, భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్, విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు. అభ్యర్థులు https://www.sports.ap.gov.in/#/లింక్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5 ఖాళీలను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలు, విద్యార్హతల వివరాలు ఇలా ఉన్నాయి.
సీనియర్ కన్సల్టెంట్స్: ఈ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. స్పోర్ట్స్ మేనేజ్మెంట్ విభాగంలో మాస్టర్ డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అర్హులు. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు. మార్చి 10 నాటికి 45 ఏళ్లలోపు ఉండాలి.
మార్కెట్ ఎగ్జిక్యూటీవ్: ఈ విభాగంలో 2 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. 50 ఏళ్లు ఉండాలి.
మీడియా మేనేజర్: ఈ విభాగంలో 1 ఖాళీ ఉంది. సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అర్హులు. మార్చి 10 నాటికి 45 ఏళ్లు మించకుండా ఉండాలి.
వేతనం: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ.45 వేల నుంచి రూ.75 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక చేస్తారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్‌తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







