100 మంది భారతీయ విద్యార్థులపై పోలండ్ సైనికులు దాడి
- March 03, 2022
పోలండ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించినప్పటి నుంచి కష్టాలు ఎదుర్కొంటున్న భారతీయ విద్యార్థులను మరిన్ని ఇబ్బందులు వెంటాడుతున్నాయి. భారత్ చేరుకోవాలంటే ఉక్రెయిన్ను వీడి పొరుగుదేశాలకు చేరుకోవాలని భారత ప్రభుత్వం సూచించింది.దీంతో వందలామంది భారత విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని చేబూని సరిహద్దు దేశాలకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి భారత ప్రభుత్వం సిద్ధం చేసిన విమానాల్లో స్వదేశానికి తరలివస్తున్నారు. ఇప్పటి వరకు వందలాదిమంది విద్యార్థులు ఇలా స్వదేశం చేరుకున్నారు.
గత నెలలో భారత విద్యార్థులకు ఎదురైన చేదు ఘటన ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దాదాపు 100 మంది భారతీయ విద్యార్థులు ఎలాగోలా పోలండ్ సరిహద్దుకు చేరుకుంటే అక్కడ వారికి చేదు అనుభవమే ఎదురైంది. సరిహద్దుకు చేరుకున్న వీరిపై పోలండ్ సైనికులు దాడిచేశారు. ఆపై తిరిగి ఉక్రెయిన్‌లోకి తిప్పి పంపించారు.గత నెల 26న ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చింది.ఐక్యరాజ్య సమితిలో బెలారస్ రాయబారి వాలెంటిన్ రిబకోవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.ఆ విద్యార్థులందరినీ రొమేనియాలోని శరణార్థి శిబిరాలకు తిప్పి పంపినట్టు తెలిపారు.
తాజా వార్తలు
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు
- యూఏఈలో సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇంధన ధరలు
- కువైట్‌లో భారీగా మద్యం స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్..!!
- ఒమన్‌లో వైద్య ఫీజుల మినహాయింపు జాబితాలో మార్పులు..!!
- సౌదీలో తప్పుడు సమాచారం ఇస్తే ఐదేళ్ల జైలు..SR2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్‌లో వాట్సాప్ మెసేజ్‌లు, వాయిస్ మెసేజ్‌లు అప్పు ఆధారాలుగా పనికొస్తాయా?
- బహ్రెయిన్‌లో విషాదం.. బాత్‌టబ్‌లో పడి మూడేళ్ల భారతీయ బాలుడి మృతి..!!
- యూఏఈలో 52 మంది బిలియనీర్లు.. వీరి మొత్తం సంపద ఎంతంటే?
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక







