కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- July 04, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పం పర్యటనలో భాగంగా ఒక సంచలన ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ తరహాలోనే.. త్వరలోనే కుప్పంలోనూ బంగారు ఉత్పత్తి (మైనింగ్) ప్రారంభం కానుందని ఆయన వెల్లడించారు. కుప్పం ప్రాంతాన్ని కేవలం వ్యవసాయ ఆధారిత ప్రాంతంగానే కాకుండా, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చేయబోతున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గానికి రాబోయే పెట్టుబడుల వివరాలను వెల్లడిస్తూ.. దాదాపు రూ. 9,322 కోట్ల భారీ పెట్టుబడులతో 30 నూతన పరిశ్రమలు కుప్పం ప్రాంతానికి రానున్నాయని, వీటి స్థాపన ద్వారా స్థానిక యువతకు సుమారు 87 వేల ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
కుప్పానికి విమానాశ్రయం..రాయలసీమ ప్రగతిపై సీఎం ప్రత్యేక నజర్
కుప్పం నియోజకవర్గ రూపురేఖలను మార్చేలా మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే అతి త్వరలోనే కుప్పానికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విమానాశ్రయం (Airport) కూడా రాబోతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే సంఘ విద్రోహ శక్తుల పట్ల ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని సీఎం చంద్రబాబు ఈ వేదికగా గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







