రష్యా అధ్యక్షుడు పుతిన్ తలపై అమెరికాలోని రష్యా కుబేరుడు రివార్డు
- March 03, 2022
అమెరికా: పొరుగుదేశం ఉక్రెయిన్ పై దురాక్రమణ జరుపుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. స్వదేశంలోనూ పుతిన్ నిరసన సెగలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాగా, రష్యా కుబేరుడు ఒకరు పుతిన్ తలపై రివార్డు ప్రకించారు. రాజకీయ ఒత్తిళ్లతో రష్యాను విడిచిపెట్టి అమెరికాలో ఉంటున్న అలెక్స్ కొనానిఖిన్ ఓ సంపన్నుడు. అనేక రాజకీయపరమైన కారణాలతో కొనానిఖిన్ 1992లో రష్యాను వీడి అమెరికా చేరుకున్నారు. అక్కడే అనేక స్టార్టప్ లలో పెట్టుబడులు, క్రిప్టో వ్యాపారాలతో తన సంపదను వేల కోట్లకు పెంచుకున్నారు. అయితే, పుతిన్ అనుసరిస్తున్న విధానాలు కొనానిఖిన్ కు కోపం తెప్పించాయి. ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో ఆ ఆగ్రహం మరింత పెరిగింది. అందుకే, పుతిన్ ను సజీవంగా బంధించినా, చంపేసినా భారీ మొత్తంలో నజరానా అందిస్తానని కొనానిఖిన్ ఓ ప్రకటన చేశాడు.
ప్రస్తుత పరిస్థితులు తీవ్ర అసహనం కలిగిస్తున్నాయని, పుతిన్ విధానాలతో రాజ్యాంగం అనేది ఉన్నా లేనట్టే అయిందని పేర్కొన్నాడు. ప్రజాస్వామ్యయుత ఎన్నికలు లేకుండా చేసి, జీవితకాలం పాటు తానే రష్యా అధ్యక్షుడిగా ఉండేలా నిర్ణయాలు తీసుకున్నాడని విమర్శించారు. తాను కూడా రష్యా పౌరుడినే అని, దేశాన్ని నాజీయిజం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై కూడా ఉందని కొనానిఖిన్ పేర్కొన్నారు. అందుకే, పుతిన్ ను ప్రాణాలతో అరెస్ట్ చేసిన వారికి, లేదా చంపేసినా సరే… వారికి రూ.7.5 కోట్లు ఇస్తానని వెల్లడించారు.
Russians are not happy. Businessman Alex Konanykhin posted this bounty for $1,000,000 to arrest Putin for war crimes. pic.twitter.com/P4RFDpOMO3
— Jay Arnold (@jadedcreative) March 2, 2022
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







