హను-మాన్: అంజమ్మ ఫస్ట్ లుక్ విడుదల చేసిన స్టార్ హీరో
- March 04, 2022
చెన్నై: యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్ తేజ సజ్జా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మొదటి పాన్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం “HANU-MAN”. ఈ చిత్రం అన్ని దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదల కానుంది. ఇప్పటికే భారీ స్థాయిలో నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమాలో అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. భారీ వీఎఫ్ఎక్స్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి నలుగురు సంగీత స్వరకర్తలు మ్యూజిక్ అందిస్తున్నారు. అందులో అనుదీప్ దేవ్, హరి గౌరా, జై క్రిష్, కృష్ణ సౌరభ్ ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటోంది.
కాగా విషయంలోకి వస్తే ఈరోజు సినిమాలో నుంచి అంజమ్మ ఫస్ట్ లుక్ విడుదలైంది. కోలీవుడ్ బాద్షా కిచ్చా సుదీప్ అంజమ్మ క్యారెక్టర్లో నటిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్‌లుక్‌ని ఆమె పుట్టినరోజుకి ఒక రోజు ముందు విడుదల చేశారు. బాగా కోపంగా ఉన్న ఈ బ్యూటీ విలన్లను ఇరగదీస్తున్నట్లుగా కన్పిస్తోంది. చేతిలో కొబ్బరికాయల గుత్తితో వధువు వేషంలో వరలక్ష్మి శరత్ కుమార్ లుక్ ఆసక్తికరంగా ఉంది. ఇక ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన హీరో, హీరోయిన్ల ఫస్ట్ లుక్ లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







