పాకిస్తాన్ మసీద్ లో బాంబు పేలుడు.. 30 మంది మృతి
- March 04, 2022
పాకిస్తాన్: పాకిస్తాన్ పెషావర్ లోని ఓ మసీద్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 30 మంది మృతి చెందారు.వాయువ్య పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో కోచా రిసల్దార్ ప్రాంతంలో జరిగిన పేలుడులో కనీసం 30 మంది మరణించారని.. వంద మందికి పైగా గాయపడినట్లు పోలీసులు చెబుతున్నారు.పెషావర్‌లో శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో ఈ పేలుడు సంభవించింది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.. మేం అత్యవసర స్థితిలో ఉన్నాము మరియు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నామని.. మరోవైపు, పేలుడు యొక్క స్వభావాన్ని పరిశీలిస్తున్నామని.. అయితే ఇది ఆత్మాహుతి దాడిగా అనిపిస్తోందని పోలీసు అధికారి మహ్మద్ సజ్జాద్ ఖాన్ వెల్లడించారు.. పేలుడు సంభవించిన మసీదు.. పరిసర ప్రాంతాల్లో అనేక మార్కెట్లు ఉన్నాయని.. సాధారణంగా శుక్రవారం ప్రార్థనల సమయంలో రద్దీగా కూడా ఉండడంతో.. ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, పేలుడుకు ముందు కాల్పుల శబ్దం కూడా వినిపించినట్లు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.మసీదులో జరిగిన ఆత్మహుతి దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించారు. అధికారుల నుంచి పేలుడుకు సంబంధించిన నివేదికను కోరారు. నిజానికి ఇవాళ రావల్పిండిలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది. ఆ మ్యాచ్ ను వీక్షించేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రావల్పిండి రావాల్సి వుంది.
తాజా వార్తలు
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు
- ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఖతార్..!!
- రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి: కేటీఆర్
- దుబాయ్ ఇ-స్కూటర్ రూల్స్: జోన్లు, జరిమానాల పై ఆర్టీఏ క్లారిటీ..!!
- అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలో మెరిసిన ఒమన్..!!
- హోర్ముజ్ జలసంధి దిగ్బంధనం..ప్రపంచ వాణిజ్యానికి ముప్పు..!!
- కువైట్ లో ప్రజా రవాణా వ్యవస్థ ఆధునీకీకరణ..!!
- మక్కా, మదీనాలో 23వేలకు పైగా తనిఖీలు..!!
- చూపు లేకుండా శిశువు జననం..తల్లికి రూ.కోటి పరిహారం









