హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం: ఏపీ హోం మంత్రి సుచరిత
- March 04, 2022
అమరావతి: ఏపీ రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం నాడు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఏపీ హోం మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం వెనక్కు తగ్గబోదన్నట్లుగా ఆమె వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు తీర్పును ఖచ్చితంగా సవాల్ చేసి తీరతామని ఆమె పేర్కొన్నారు.
శుక్రవారం గుంటూరు జిల్లా పరిధిలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రాష్ట్ర మహిళా కమిషన్ ఏర్పాటు చేసిన మహిళా పార్లమెంటును ఆమె ప్రారంభించారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె పాలనా వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాజధాని ఎక్కడ ఉండాలనే దానిని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలకు ఉందని కూడా ఆమె తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే హైకోర్టు ఇచ్చిన తీర్పును తమ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేస్తుందని ఆమె వెల్లడించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







