NTPCలో ఉద్యోగాలు..
- March 05, 2022
భారత ప్రభుత్వానికి చెందిన నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) ఝార్ఖండ్ లోని కోల్ మైనింగ్ హెడ్ క్వార్టర్స్‌లో ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్దుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.ఈ నోటిఫికేషన్ ద్వారా 177 పోస్టులను భర్తీ చేయనున్నారు. మార్చి 15 దరఖాస్తులకు చివరి తేదీ. అభ్యర్ధులు పూర్తి వివరాలకు https://careers.ntpc.co.in/ వెబ్సైట్ చూడొచ్చు. మొత్తం పోస్టుల సంఖ్య: 177
మైనింగ్ ఓవర్‌మెన్: 74 అర్హతలు: మైనింగ్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. డీజీఎంఎస్ ఓవర్‌మెన్ సర్టిఫికెట్ ఉండాలి. అలాగే సంబంధిత పనిలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉండాలి. జీతం: నెలకు రూ.50,000 జీతంగా చెల్లిస్తారు. మైనింగ్ సర్థార్: 103 పోస్టులు అర్హతలు: పదోతరగతి/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. డీజీఎంఎస్ ఓవర్‌మెన్ సర్టిఫికెట్తో పాటు సంబంధిత పనిలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. వయోపరిమితి: అభ్యర్థుల వయసు 57 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.40,000 ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. పరీక్ష విధానం: 100 మార్కులకు 100 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని స్కిల్ టెస్టుకు పిలుస్తారు. దరఖాస్తు విధానం: ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 15, 2022 పూర్తి వివరాలకు వెబ్సైట్: https://careers.ntpc.in/
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







