పుతిన్ తో మాట్లాడండి..యుద్దాన్ని ఆపండి..మోడీ ని కోరిన ఉక్రెయిన్
- March 06, 2022
రష్యా తమపై దాడులను ముమ్మరం చేయడంతో ఉక్రెయిన్ మరోసారి భారత్ మద్దతు కోరింది. తమ దేశంపై చేస్తున్న దాడులకు పుతిన్ ముగింపు పలికేలా భారత్ చొరవ తీసుకోవాలని ఉక్రెయిన్ విజ్ఞప్తి చేసింది.
యుద్ధ పరిణామాలను పుతిన్‌కు మోదీ వివరించాలని అన్నారు. యుద్ధం ప్రపంచ ప్రయోజనాలకు వ్యతిరేకమేనని పుతిన్‌కు భారత్ వివరించాలని ఉక్రెయిన్ కోరింది. ఈ మేరకు భారత ప్రధాని మోదీని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా విజ్ఞప్తి చేశారు.
ఉక్రెయిన్ వ్యవసాయ ఉత్పత్తులను వినియోగించుకునే అతి పెద్ద వినియోగదారు భారతేనన్నారు. యుద్ధం కొనసాగితే కొత్త పంటలను వేయడం సాధ్యం కాదని దిమిత్రో అన్నారు. యుద్ధం ఇంకా కొనసాగితే భారత్ ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయని పేర్కొన్నారు. భారత తమ ఆహార భద్రత కోసమైనా యుద్ధాన్ని ఆపడం చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కూడా ఇదే విధంగా ఓ ట్వీట్ చేసింది. ప్రపంచ ఆహార భద్రతకు హామీ ఇస్తున్న దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి అని తెలిపింది. తమ దేశంలో ఉత్పత్తి అయిన సన్‌ఫ్లవర్ ఆయిల్లో 55 శాతం మేరకు ప్రపంచానికి ఎగుమతి అవుతోందని తెలిపింది. ఈ యుద్ధం భారత ప్రయోజనాలను కూడా దెబ్బతీస్తోందని అభిప్రాయపడింది. దీనిని దృష్టిలో పెట్టుకొని అయినా యుద్ధాన్ని ఆపాలని పుతిన్‌కు భారత్ చెప్పాలని ఉక్రెయిన్ తెలిపింది. తమ దేశ వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం భారత్‌లోనే ఎక్కువని తెలిపారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







