సందర్శకులు తాజ్‌మహల్ చూడాలంటే రూ.1000 చెల్లించా లి
- March 31, 2016
భారత్‌లోని ప్రఖ్యాత కట్టడాల సందర్శన టిక్కెట్ ధరలను పురావస్తు శాఖ భారీగా పెంచింది 'ఏ', 'బి' కేటగిరీల కట్టడాల సందర్శనకు విదేశీయులకు టిక్కెట్ ధరలు రెట్టింపయ్యాయి. ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన తాజ్‌మహల్ సందర్శనకు విదేశీయులకు గతంలో రూ.250 టిక్కెట్ ఉంటే... ఇప్పడది... రూ.500కు చేరింది. టోల్ పన్నులు అన్ని కలిపి విదేశీ సందర్శకులు తాజ్‌మహల్ చూడాలంటే రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.దేశీయ సందర్శకులు మాత్రం రూ.30 చెల్లిస్తే తాజ్‌మహల్ సందర్శించవచ్చు. ఆగ్రా డెవలప్మెంట్ అథారిటీ వసూలు చేసే టోల్ ట్యాక్స్‌తో కలిపి రూ.40 అవుతుంది. గతంలో తాజ్‌మహల్, కుతుబ్‌మినార్ తదితర 'ఏ' కేటగిరీ కట్టడాలకు రూ.10 టిక్కెట్ ఉండగా... ఇప్పుడు రూ.30కి పెంచారు.అలాగే 'బీ' కేటగిరీ కట్టడాలకు భారతీయులకు రూ.5 నుంచి రూ.15 చేశారు. విదేశీయులకు రూ.100 నుంచి రూ.200 చేశారు. విదేశీయులు 'ఏ' కేటగిరీ కట్టడాలకు రూ.750, 'బి' కేటగిరీ కట్టడాలకు రూ.300 చెల్లిస్తే ప్రత్యేక సదుపాయాలు కూడా ఉంటాయని పురావస్తు శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







