అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక నిర్ణయం
- March 08, 2022
న్యూ ఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రభావం అన్ని రంగాలపై పడింది.ఇక, అంతర్జాతీయ ప్రయాణాలపై అనేక ఆంక్షలు విధించారు.ప్రత్యేకంగా ఎంపిక చేసిన మార్గాలు,అది కూడా ప్రభుత్వ అనుమతితో..మరీ ముఖ్యంగా ప్రత్యేక పరిస్థితుల్లో నడిపించాల్సిన పరిస్థితి వచ్చింది.ఇక, త్వరలోనే రెగ్యులర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.దీనిపై కీలక ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం…ఈ నెల 27 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను పునః ప్రారంభిస్తున్నట్లు కేంద్ర విమానయాన శాఖ వెల్లడించింది.కోవిడ్ విజృంభణతో నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ ఎగరబోతున్నాయి.
కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా విజయవంతం అయ్యిందని..కోవిడ్ కేసులు తగ్గిపోవడం.. వ్యాక్సినేషన్ క్రమంగా పెరగడంతో…సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత 27వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలపై ఉన్న ఆంక్షలను తొలగిస్తున్నట్టు..ఇక, ఆ రోజు నుంచి అంతర్జాతీయ విమానాలను యథాతథంగా షెడ్యూల్ చేస్తామని కేంద్ర విమానయాన శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







