అబుధాబిలో మహిళా దినోత్సవ సంబరాలు....

- March 08, 2022 , by Maagulf
అబుధాబిలో మహిళా దినోత్సవ సంబరాలు....

......మహిళా మహిళా  మహిళా .....

అవని నుంచి అంతరిక్షం దాకా 
అలుపెరగని నిర్మలమైన ప్రవాహం 
ఆటుపోట్లు కెరటాలు ఉప్పెనలు 
ఎన్ని ఎదురైనా తనదైన శైలిలో 
మహోన్నత శిఖరాలను అధిరోహిస్తు
తన ప్రేమని పంచుతున్న అధ్భుతశక్తి
తాను కరుగుతూ వెలుగులు పంచే
అఖండ జ్యోతి  బంధాలు బరువని 
తలంచక కొండంత బరువుని మోస్తు 
అష్టకష్టాలని భరిస్తు చిరుదరహసంతో
సహనమే ఆయుధంగా దూసుకెళ్తున్న 
క్షమ ఔదార్యం శాంతి సుగుణాల గల
జగతిన వెలసిన అధ్భుతమైన ఆదిశక్తి 
మనసున్న మమకారపు మాధుర్యం మహిళ 
మమతానురాగాలు శాంతి మూర్తి మహిళ
సర్వస్వాన్ని మోస్తున్న భూమాత మహిళ
ఆత్యాగమయికి ఏడాదిలో ఓ రోజు కాదు
అంతటి ప్రేమమూర్తికి నిరంతరం గౌరవిద్దాం 
ఆదరిద్దాం ప్రేమిద్దాం ఔన్నత్యాన్ని చాటుదాం 
మహిళా మణులకి చేతులెత్తి మొక్కుదాం 
వందనం అభివందనం అభివందనం.

--యామిని కొళ్లూరు(అబుధాబి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com