శ్రీవారి భక్తులకు శుభవార్త...
- March 09, 2022
తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ప్రారంభించాలని నిర్ణయించింది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆర్జిత సేవలను తిరిగి ప్రారంభించి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ ఒక ప్రకటన విడుదల చేసింది.
శ్రీవారికి.. నిత్య సేవల్లో భాగంగా.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, మేల్‌చాట్ వస్త్రం, అభిషేకం, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు నిర్వహిస్తారు. కోవిడ్-19 పరిస్థితులకు ముందున్న విధానంలోనే ఆర్జిత సేవా టికెట్ల బుకింగ్ కొనసాగుతుంది.
అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలకు సంబంధించి భక్తులు నేరుగా పాల్గొనే విధానంతో పాటు వర్చువల్ విధానం కూడా కొనసాగుతుంది. వర్చువల్ సేవలను బుక్ చేసుకున్న భక్తులు ఆయా సేవల్లో నేరుగా పాల్గొనే అవకాశం లేదు.
వారికి దర్శనం కల్పించడంతోపాటు ప్రసాదాలు అందించడం జరుగుతుంది. అడ్వాన్స్ బుకింగ్‌లో ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న వారిని, ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని సేవలు బుక్ చేసుకున్న వారిని ఏప్రిల్ 1వ తేదీ నుండి కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఆయా సేవలకు అనుమతిస్తారు.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్‌లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్‌లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్‌పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్‌లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్‌గ్రేడ్‌లో 72% పనులు పూర్తి..







