గోవాలో బీజేపీ మూడోసారి గెలుపు

- March 10, 2022 , by Maagulf
గోవాలో బీజేపీ మూడోసారి గెలుపు

పనాజీ: గోవాలో వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధం అయ్యింది భారతీయ జనతా పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మెజారిటీ స్థానాలకు ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయినా.. స్వతంత్రుల మద్దతుతో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు రెడీ అయిపోయింది.. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న గోవాలో బీజేపీ 20 స్థానాల్లో.. కాంగ్రెస్ పార్టీ 12 స్థానాల్లో, టీఎంసీ 2, ఆమ్‌ఆద్మీ పార్టీ 2, ఇతరులు 4 స్థానాల్లో విజయం సాధించారు..

బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో.. ఆ పార్టీకి మద్దతు పలుకుతున్నారు స్వతంత్ర అభ్యర్థులు. బిచోలిమ్ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్​చంద్రకాంత్​ శెట్టి బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఇక, కొర్టాలిమ్​ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందిన అలెక్జియో రెజినాల్డో కూడా బీజేపీకే జై కొట్టారు.. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి మార్గం సుగమం అయ్యింది. ఇక, మరోసారి గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ముఖ్యమంత్రి ప్రమోద్​సావంత్​. పార్టీ కార్యకర్తల కృషితోనే ఈ ఎన్నికల్లో విజయం సాధ్యమైందన్న ఆయన.. గోవాలో బీజేపీ మరోమారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.. కాగా, సాంకేలిమ్​స్థానం నుంచి పోటీ చేసిన సావంత్..​కాంగ్రెస్ పార్టీ​ అభ్యర్థిపై 650 ఓట్లకుపైగా మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com