షార్జాలో పాన్ అమ్మిన వ్యక్తి అరెస్ట్
- April 01, 2016
అల్ దాహిద్ మున్సిపాలిటీ 1,000 కిలోల పాన్ (నార్కోటిక్ సబ్‌స్టాన్స్)ని సీజ్ చేసింది. ఈ సందర్భంగా ఆసియాకి చెందిన వ్యక్తిని అరెస్ట్ చేసింది. యూఏఈలో పాన్ నిషిద్ధం. మునిసిపాలిటీ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్‌లో ఓ ఇంటిపై దాడి చేసి, పెద్దమొత్తంలో పాన్ని సీజ్ చేయడం జరిగింది. 2091 బ్యాగ్స్‌ని ఈ సందర్భంగా అధికారులు గుర్తించారు. అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 55 కిలోల పాన్ని సీజ్ చేయడం జరిగింది. 990 కిలోల రా పాన్, తయారీలో ఉండగా దాన్ని కూడా సీజ్ చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మునిసిపాలిటీ ఆపరేషన్స్ హెడ్ సలీమ్ సయీద్ అల్ తునైజి మాట్లాడుతూ, సహజమైన కొన్ని పదార్థాలను, కొన్ని రసాయనాలతో కలిపి పాన్‌గా తయారు చేస్తారు. సమాజానికి ఇది ఎంతో చెడు చేస్తుందని అన్నారాయన.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







