దొంగతనాల నుంచి ఇంటికి ఇన్స్యూరెన్స్
- April 01, 2016
యూఏఈలో 1 శాతం కంటే తక్కువ ఇళ్ళకే, తమ ఇంట్లోని విలువైన వస్తువులకు సంబంధించిన ఇన్స్యూరెన్స్ ఉందని ఓ ఇన్స్యూరెన్స్ సంస్థ వెల్లడించింది. దొంగతనాల కారణంగా విలువైన వస్తువల్ని కోల్పోతే అది ఆ కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతాయనీ, అలాంటి సందర్భాల్లో ఇన్స్యురెన్స్ వారికి అండగా నిలుస్తుందని సంస్థ ప్రతినిథులు చెప్పారు. ఇంటిని మాత్రమే కాకుండా, ఇంట్లోని వస్తువుల్ని కూడా ఇన్స్యూర్ చేసుకోవడం మంచిదనీ, ఈ విషయంలో తాము ఎంతగా అవగాహనా కార్యక్రమాలు చేపడ్తున్నా, వినియోగదారులు పెద్దగా పట్టించుకోవడంలేదనీ మెనా రిటైల్, ఖతార్ ఇన్స్యూరెన్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రెడ్రిక్ బిస్బ్జెర్గ్ చెప్పారు. ఇదిలా ఉండగా, తమ ఇళ్ళు దోపిడీకి గురి కాకుండా, తాము ఇంట్లో లేనప్పుడు సన్నిహితులు, బంధువులు, లేదా సమీపంలో ఉండే స్నేహితుల్ని అప్పుడప్పుడూ తమ ఇంటిని గమనించాల్సిందిగా సూచించాలి. లాక్ చేసే సమయంలో అన్నీ సరిగ్గా చూసుకోవాలి. అలాగే భద్రతా ఏర్పాట్లు ముఖ్యం. ప్రధానంగా ఇంట్లో పనిచేసేవారితో దొంగలు సఖ్యంగా ఉంటారు. పని మనుషుల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







