కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నా రాజేంద్రప్రసాద్..
- April 01, 2016
భార్యాభర్తల మధ్య అనుబంధాలు, కోపతాపాలను చక్కగా తెరపై చూపిన చిత్రం 'పెళ్లిపుస్తకం' అని మా అధ్యక్షుడు, టాలీవుడ్ ప్రముఖ నటుడు జి.రాజేంద్రప్రసాద్ తెలిపారు. శుక్రవారం విజయవాడలో రాజేంద్రప్రసాద్ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల రాజేంద్రప్రసాద్ విలేకర్లతో మాట్లాడుతూ... బాపు, రమణలు చక్కగా తెరకెక్కించిన పెళ్లి పుస్తకం చిత్రం విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకుందని ఆయన గుర్తు చేశారు. ఈ సందర్బంగా అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చినట్లు రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. మా తరపున సినిమా కళాకారులందరికీ ఆరోగ్య కార్డులు జారీ చేసినట్లు చిత్ర పరిశ్రమలోని వారి కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్బంగా రాజేంద్రప్రసాద్ వివరించారు.అంతకుముందు అధికారులు రాజేంద్రప్రసాద్ కు ఆలయంలో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు రాజేంద్రప్రసాద్ కు అందజేశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







