ఇంటిలో కొంత భాగం కమర్షియల్ వినియోగానికి
- April 01, 2016
మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్‌మెంట్, కొన్ని ముఖ్యమైన వీధుల్లోని ఇళ్ళు కొంత భాగం కమర్షియల్ వినియోగానికి వీలుగా వాడుకోవడానికి అనుమతిచ్చింది. మదినాత్ ఖలీఫా రాదాత్ అల్ ఖైల్, అల్ ముర్రాలోని ఫురోసియా స్ట్రీట్, న్యూ రయ్యాన్‌లోని అల్ వజ్బా స్ట్రీట్, ఉమ్ సలాల్‌లోని ఉమ్ సలాల్ స్ట్రీట్, ఉమ్ ఖర్న్‌లోని ఉమ్ కర్న్ స్ట్రీట్ మరియు సెమైసిమాలోని సెమైసిమా స్ట్రీట్ ఇందులో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయబడ్డాయి. ఈ ప్రాంతాల్లో రోడ్ల పక్కనే ఇళ్ళు కలవారు, తమ ఇళ్ళలోని కొంత భాగాన్ని వ్యాపారాత్మక అవసరాల కోసం వినియోగించవచ్చు. దీని కోసం లైసెన్సుల్ని పొందాల్సి వుంటుంది. ఇలా చేయడం వల్ల బిజినెస్ యాక్టివిటీస్ పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీని కోసం ఇళ్ళను కలిగినవారు, మినిస్ట్రీ ద్వారా ఆమోదం పొందిన డిజైన్లకు వీలుగా ఇళ్ళను మార్చుకోవాలి. ఈ విధానం ద్వారా పౌరులూ లాభం పొందుతారని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







