ఆన్‌లైన్ చెల్లింపు మోసానికి పాల్పడ్డ వారికి 10 ఏళ్ల జైలు!
- March 13, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ ప్రభుత్వ పోర్టల్ ద్వారా నకిలీ చెల్లింపులు చేసినందుకు ఆరుగురుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితులపై మోసం, ఫోర్జరీ అభియోగాలు మోపింది. నేరం రుజువైతే నిందితులకు పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. నకిలీ చెల్లింపులను ధృవీకరించడానికి పేమెంట్ పోర్టల్‌లోని డేటాను ట్యాంపర్ చేయడానికి నిందితులు eKeyలను ఉపయోగించారని కోర్టు ఫైల్‌లు చెబుతున్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూషన్ పోర్టల్‌లో అసాధారణ లావాదేవీలను గమనించిన తర్వాత ప్రభుత్వ ఏజెన్సీ నివేదిక ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది. తమ బిల్లులను సెటిల్ చేసేందుకు విదేశీ బ్యాంకుకు చెందిన చెల్లని క్రెడిట్ కార్డును ఆరుగురు నిందితులు ఉపయోగించినట్టు విచారణలో గుర్తించారు. నిందితులు పోర్టల్‌లోని పలువురి ఇ-కీలను దుర్వినియోగం చేశారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అరెస్టయిన్ వారిలో జిసిసి దేశంలో పరారీలో ఉన్న వాంటెడ్ వ్యక్తి కూడా ఉన్నారు. అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో అతన్ని అరెస్టు చేసి బహ్రెయిన్‌కు పంపించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







