యుక్రెయిన్ ప్రజలకు ఆశ్రయం ఇస్తే బహుమతి..ఒక్కో శరణార్థికి 456 డాలర్లు: బ్రిటన్ ప్రకటన

- March 14, 2022 , by Maagulf
యుక్రెయిన్ ప్రజలకు ఆశ్రయం ఇస్తే బహుమతి..ఒక్కో శరణార్థికి 456 డాలర్లు: బ్రిటన్ ప్రకటన

యుక్రెయిన్ పై రష్యా యుద్ధంతో యుక్రెయిన్ ప్రజల జీవితాలు అత్యంత దుర్భరంగా మారాయి. సొంత దేశాన్ని..ఉన్న ఇంటిని వదిలిసి దిక్కులేని వారిలాగా ఇతర దేశాలకు వలసపోయి ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పాడ్డాయి.అలా ఎంతోమంది యుక్రెయిన్లు యూకేలోని బ్రిటన్ స్కాట్లాండ్ వంటి దేశాలకు తరలిపోయారు.

అలా వచ్చినవారిని బ్రిటన్ అక్కున చేర్చుకుంటోంది. రష్యాపై కారాలు మిరియాలు నూరుతున్న బ్రిటన్ యుక్రెయిన్ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తోంది. దీంట్లో భాగంగా యుక్రెయిన్ శరణార్ధులకు తమ ఇంట్లో చోటు (ఆశ్రయం) కల్పిస్తేవారికి నగదు బహుమానంగా ఇస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. యుక్రెయిన్ శరణార్థులకు ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే ఒక్కో యుక్రెయిన్ శరణార్థికి 450 డాలర్లు (UK currency 350 pounds)చొప్పున చెల్లిస్తామని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ పథకంలో శరణార్థులకు కనీసం ఆరు నెలల అద్దె లేకుండా ఇల్లు ఇచ్చేందుకు ముందుకొచ్చే వారి పేర్లను సంబంధిత అధికారవర్గాల వద్ద రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. ఈ క్రమంలో వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, కమ్యూనిటీ గ్రూపులు, వ్యాపార సంస్థలు ఎవరైనాఇక్కడ నమోదు చేయించుకోవచ్చని వెల్లడించింది. ఈ రకంగా ఆశ్రయం ఇచ్చిన వారికి నెలకు 456 డాలర్లు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.

యుక్రెయిన్‌ ప్రజలకు 3వేల వీసాలు జారీ చేసినట్లు యూకే వెల్లడించింది. గురువారం (మార్చి 11,2022) నుంచి యుక్రెయిన్‌ నుంచి వచ్చే ప్రజలకు వీసాలు అవసరం లేదని.. కేవలం ఆ దేశ పాస్‌పోర్టు ఉంటే చాలని పేర్కొంది. ఈ విషయాన్ని యూకే సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ మిషెల్‌ గోవె వెల్లడించారు. యుక్రెయిన్‌లోని యుద్ధ క్షేత్రం నుంచి వచ్చే ప్రజలకు వీలైనంత సాయం చేస్తామని..వారికి విద్యా,ఉద్యోగ, వైద్యంతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com