హైదరాబాద్ విమానాశ్రయం నుంచి గోండియాకు ఫ్లై బిగ్ విమాన సర్వీసులు ప్రారంభం

- March 15, 2022 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయం నుంచి గోండియాకు ఫ్లై బిగ్ విమాన సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్: GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి మహారాష్ట్రలోని గోండియాకు ఫ్లై బిగ్ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసును ప్రారంభించింది.టైర్ II, టైర్ III నగర ప్రయాణికులకు ఎయిర్ కనెక్టివిటీని అందించడం ద్వారా ప్రాంతీయ కనెక్టివిటీని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన UDAN కార్యక్రమం కింద దీనిని ప్రారంభించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో వేడుకగా జరిగిన ఒక కార్యక్రమంలో విమానాశ్రయ అధికారులు, ఫ్లై బిగ్ అధికారులు, ఇతర భాగస్వాములు,గోండియాకు వెళుతున్న ప్రయాణికులకు ఆహ్వానం పలికారు.

ఫ్లైబిగ్  విమానం S9401 ఉదయం 6.20 గం.కు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి గోండియాకు బయలుదేరుతుంది. తిరిగి మధ్యాహ్నం 13.50 గంటలకు S9402 విమానం హైదరాబాద్ చేరుకుంటుంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, గోండియాల మధ్య ప్రతి రోజూ ఈ విమాన సర్వీసు ఉంటుంది.  ఈ సర్వీసుతో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి జాతీయ గమ్యస్థానాల (డొమెస్టిక్ డెస్టినేషన్స్) సంఖ్య 70 కు చేరింది. కోవిడ్‌కు ముందు ఇది 55.

GMR హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ CEO, ప్రదీప్ పణికర్ మాట్లాడుతూ, "2021 రెండో త్రైమాసికం నుంచి ప్రయాణికుల డిమాండ్ పెరడగడంతో మేం నూతన గమ్యస్థానాలకు విమాన సర్వీసులు ప్రారంభించాం. గత కొన్నేళ్లుగా విమాన సర్వీసులకు ఆదరణ పెరుగుతూ, ప్రయాణికులు మళ్లీ తమకిష్టమైన గమ్యస్థానాలకు వెళ్లడానికి ఉత్సాహంగా ఉన్నారు. అందుకని ఇంతవరకు విమాన సర్వీసులు లేని ప్రాంతాలు, మరీ ముఖ్యంగా టైర్ II, టైర్ III నగరాలకు ప్రాంతీయ కనెక్టివిటీని పెంచడానికి మేం కృషి చేస్తున్నాం. భౌగోళికంగా హైదరాబాద్ నగరానికున్న అడ్వాంటేజెస్ దీనికి దోహదపడుతున్నాయి. ఒక ఎయిర్ పోర్టు ఆపరేటర్ గా ప్రయాణికులకు కొత్త గమ్యస్థానాలకు సర్వీసులు ప్రారంభించడం మాకెంతో ఉత్తేజం కలిగిస్తోంది’’ అన్నారు. 

మహారాష్ట్రలోని గోండియాలో అసంఖ్యాకమైన రైస్ మిల్లులు ఉన్నాయి. ఈ నగరాన్ని ‘రైస్ సిటీ’ అని కూడా అంటారు. నావేగావ్ నేషనల్ పార్క్, నగ్జీరా అటవీ ప్రాణి సంరక్షణా కేంద్రం, కచర్ గఢ్ గుహలు, హజ్రా ఫాల్స్, ఇతర పర్యాటక ప్రదేశాలకు ఇది ప్రసిద్ధి. 

హైదరాబాద్ దక్షిణ, మధ్య భారతదేశానికి ప్రవేశ ద్వారం లాంటిది ఇది చాలా మంది ఇష్టమైన, అతిపెద్ద రవాణా కేంద్రం. ఇది విజయవాడ, విశాఖపట్నం, నాగపూర్, భువనేశ్వర్, రాజమండ్రి, భోపాల్ మరియు తిరుపతి లాంటి సమీప నగరాల నుండి వచ్చిన ప్రయాణీకులకు అనుకూలంగా ఉంటుంది. 

ఫ్లై బిగ్ మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కేంద్రంగా ఉన్న ఎయిర్ లైన్స్.దీనిని గుర్గావ్ కేంద్రంగా ఉన్న బిగ్ ఛార్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తోంది.ఈ ఎయిర్ లైన్ వద్ద ATR 72-500 మరియు ATR 72-600 తరహా విమానాలున్నాయి. ఇది ప్రతి రోజూ 20 రోజువారీ విమాన సర్వీసులు నడుపుతోంది. దేశంలోని టైర్ II లను ప్రధాన లక్ష్యంగా చేసుకుని సర్వీసులు నడుపుతున్న ఈ సంస్థ 2020 డిసెంబరులో తన సేవలను ప్రారంభించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com